January 16, 2011

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
స్వరకల్పన: పాలగుమ్మి విశ్వనాథం (?)
పాడినది: బృందం
ఆకాశవాణి ఆణిముత్యం - గుర్తు చేసిన మిత్రుడు డొక్కా ఫణికుమారునికి కృతజ్ఞతలతో 

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఎల్లరికనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో

కొండదిగీ కోన దిగీ గుబురు అడవి కొమ్మలను దిగీ
ఉండి ఉండి ఒక ఇన కిరణమ్ము ఉర్వి ప్రభాతమ్ము నింపగా

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో

ఊరక చీకటి యవనిక లో ఒక్క క్షణం దాచారో ఎవరో
వారిక తారక దీపికనూ ఆరుపనేరుతురో ఎవరో

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో

ఈ సత్యాన్వేషికి, ఈ మితభాషికి ఎంత కాలమీ బంధన?
ఈ అసత్యాలలో దైవానికి ఎంత కాలమీ శోధన?

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఎల్లరికనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో

ఇన కిరణము: సూర్య కిరణము; ఉర్వి: భూమి; యవనిక: తెర చీర, పరదా;

1 comment:

మరువం ఉష said...

నేను కూడా ఈ పాట http://vijayagopal.weebly.com/uploads/4/3/7/9/4379949/child-tellanijabilipai.mp3 వింటూ సాహిత్యం రాసుకుందామని వెదికితే మీ బ్లాగ్ తారసపడింది. మరిన్ని ఆణిముత్యాలు దొరికాయి. కొద్దిపాటి మార్పులు ఇక్కడ పెడుతున్నానండి.

వారిక తారక దీపికనూ ఆరుపనేరుతురో ఎవరో -> వారక తారక దీపికనూ ఆరుపనేరుతురో ఎవరో

ఈ సత్యాన్వేషికి, ఈ మితభాషికి ఎంత కాలమీ బంధన? -> ఈ సత్యాన్వేషికి, ఋతభాషికి ఎంత కాలమీ శోధన
ఈ అసత్యాలలో దైవానికి ఎంత కాలమీ శోధన? -> ఈ అసత్యంలో దైవానికి ఎంత కాలమీ బంధన?

నెనర్లు!