January 12, 2011

బంగారు పాపాయి

రచన: మంచాల జగన్నాథ రావు
స్వరకల్పన: సాలూరు రాజేశ్వర రావు
పాడినది: రావు బాలసరస్వతి

జగన్నాథ రావు గారు బాలసరస్వతి గారి కూతురి పుట్టినరోజు సందర్భంగా వ్రాసిన పాట.




బంగారు పాపాయి బహుమతులు పొందాలి,
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు

పలు సీమలకు పోయి, తెలివిగల పాపాయి
కళలన్ని చూపించి ఘనకీర్తి పొందాలి
ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి!

బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు

మా పాప పలికితే మధువులే కురియాలి!
పాపాయి పాడితే పాములే ఆడాలి!
మా పాప పలికితే మధువులే కురియాలి!
పాపాయి పాడితే పాములే ఆడాలి!
ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప?
ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి,
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు

బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు


తెనుగుదేశము నాది, తెనుగు పాపను నేను
అని పాప జగమంతా చాటి వెలయించాలి,
మా నోములపుడు మాబాగా ఫలియించాలి!

బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు

3 comments:

Saahitya Abhimaani said...

శ్రీధర్ గారూ మీ బ్లాగ్ కు ఏమ్తమంది వచ్చి చూస్తున్నారో మీకు తెలియటానికి ఒక కౌంటర్ బ్లాగ్ లో ఉంచండి. ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీకు నచ్చిన కౌంటర్ మీ బ్లాగులో మీరు ఏర్పరుచుకోవచ్చు:

http://www.widgeo.net/?ref=city

Sreedhar Chintalapaty said...

Thanks, శివ గారు.

GSN Murthy said...

చాలా మంచి పాట. ఈతరం తల్లులందరూ పిల్లలకి పాడీ నిద్రపుచ్చవలసిన పాట.
ధన్యవాదాలు