January 18, 2011

జయ భారతావనీ! జయ లోకపావనీ! (జయ గీతి)

రచన;వానమామలై వరదాచార్యులు
స్వరకల్పన: నూకల చిన్న సత్యనారాయణ
పాడినది: ?


జయ భారతావనీ! జయ లోకపావనీ!
శాంతి సుఖదాయినీ! జననీ, నమస్తే!

సకల సంపత్ఖనీ! సస్య నందనవనీ!
ఆసేతుశీతనగహాటకావనీ! జననీ!

నీ మహోన్నతి - హిమానీగోత్ర శిఖరం
నీ పవిత్రత - గాంగనిర్ఝర ప్రవాహం
నీ చేతి సొమ్ము - ఎల్లోరా శిల్పఖండమ్ము
నీదు వాక్యమ్ము - శ్రీ గీతోపదేశం!


జయ భారతావనీ! జయ లోకపావనీ!
శాంతి సుఖదాయినీ! జననీ, నమస్తే!
ఆసేతుశీతనగహాటకావనీ: ఆసేతు + శీతనగ + హాటక + అవనీ - రామేశ్వరం (సేతు) నించి హిమాలయ పర్యంతంగా గల బంగరు (హాటక) భూమి;
హిమానీగోత్ర: గంగోత్రి; గాంగనిర్ఝర: గంగా నది

3 comments:

Phani Dokka said...

మీకు ఎవరికైనా ఈ క్రింది పాట గుర్తుంటే చెప్పండి చూద్దాం...
(నాకు పల్లవి మాత్రమే గుర్తుంది...)

జై జై భారత జాతీయాభ్యుద ( ? )
ఆనందోత్సవ శుభ సమయం
ప్రియతమ భారత జనయిత్రీ
తవ దాస్య విమోచన నవోదయం

మీ..
ఫణి

Saahitya Abhimaani said...

శ్రీధర్ గారూ. మంచి పాటల సాహిత్యం అందిస్తున్నారు. నా చిన్న తనంలో ఆకాసవాని విజయవాడ కేంద్రంలో "కొండమీద కోయిలోకటీ కూసిందీ........" అనేపాట తరచూ వినపడేది. చిన్న పిల్లల కార్యక్రమంలో అనుకుంటాను. మీ దగ్గర ఆ పాట సాహిత్యం ఉంటే మీ బ్లాగులో ఇవ్వగలరు. ఆడియో కనుక దొరికితే అంతకంటే అద్భుతం మరొకటి లేదు.

Sreedhar Chintalapaty said...

శివ గారు,

Thanks :) నేనెప్పుడు ఆ పాట వినలేదు - కానీ దొరుకుందేమో ప్రయత్నిస్తాను.