May 19, 2011

నా దేశం - నవ్వుతున్న నందనాల సుమగీతం

రచన:  మంగళగిరి ఆదిత్యప్రసాద్
స్వరకల్పన: అనిపిండి (రామడుగు) మీనాక్షి
పాడినది: ???
శ్రీమతి అనిపిండి మీనాక్షి గారికి కృతజ్ఞతలతో.


నా దేశం - నవ్వుతున్న నందనాల సుమగీతం
నా దేశం - వేదంలా తారాడే సంగీతం
నవయువకుల నాడినుండి, నవశక్తుల నీడనుండి,
ఎదలూయలలూగుతున్న ఉదయకాంతి జలపాతం

యుగాలైన కరగిపోని ఘనతకిల్లు నా దేశం!
యుగకర్తల, సంస్కర్తల, ఘనులకిల్లు నా దేశం!
అడుగడుగున సందేశం, అణువణువున ఆవేశం!
నా భారత దేశానికి సాటి రాదు ఏ దేశం!

కులమతాల కోకిలలకు గున్నమావి నా దేశం!
బాధితులను ఓదార్చే బోధితరువు నా దేశం!
మురిపించే దరహాసం, మరపించే మధుమాసం!
ధరకంతకు ప్రాణమిచ్చు సురభోజం నా దేశం!

సురభోజం: దేవతల రాజ్యం

3 comments:

Rajesh Devabhaktuni said...

ఆహా...! చాల చక్కని రచన.... చక్కటి బావంతో. ఈ పాట గురించి మాకు తెలియచేసినందుకు శ్రీధర్ గారికి కృతఙ్ఞతలు.

durga said...

Sreedhargaru, what a beautiful song. Wish we had the audio, also. If you have pl. do post it.

Regards
durgagra

durga said...

Sreedhargaru, thank for posting a wonderful song, wish you had the audio also.
regards
Durga