February 1, 2011

నీలాలు కారేనా, కాలాలు మారేనా

చిత్రపటము: ముద్దమందారం (1981)
రచన: వేటూరి సుందర రామ  మూర్తి
స్వరకల్పన: రమేష్ నాయుడు
పాడినది: ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం




నీలాలు కారేనా, కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా?
జాజి పూసే వేళ, జాబిల్లి వేళ
పూలడోల నేను కానా
నీలాలు కారేనా, కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా
జాజి పూసే  వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా

సూరీడు, నెలరేడు
    - సిరిగల దొరలే కారులే,
పూరిగుడిసెల్లో, పేదమనస్సులో
   - వెలిగేటి దీపాలులే!
ఆ నింగి, ఈ నేల
   - కొనగల సిరులే లేవులే,
కలిమి లేముల్లో కరిగే ప్రేమల్లో
   - నిరుపేద లోగిళ్ళులే

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా
జాజి పూసే  వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో,
కలికి వెన్నెల్లో
   - కలల కన్నుల్లో కలతారిపోవాలిలే
ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో
ఒడిలో నీవుంటే, ఒదిగి పోతుంటే
   - కడతేరి పోవాలిలే

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా
జాజి పూసే  వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా
జాజి పూసే  వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా

డోల: ఉయ్యాల బల్ల; వెత: వ్యథ; కలతారిపోవాలి: కలత + ఆరిపోవాలి (క్షోభ ఉపశమించాలి); కడతేరి: ఇక్కడ జీవితం గడిచిపోవాలనే అర్థం లో వాడబడింది. "కడతేరి" అంటే "సఫలమయ్యి" అని కూడా అర్థం ఉంది (బ్రౌణ్యం) - ఆ అర్థం కూడా పొసుగుతుంది.

1 comment:

Rajesh Devabhaktuni said...

చాల చక్కని పాట. ఇక్కడే మొదటిసారి విన్నాను. రమేష్ నాయుడు గారు ఎన్నో చిత్రాలకు చాల చక్కని సంగీతం అందించారని విన్నాను, ఏదో బ్లాగులో చదివాను. ఆయన సంగీతం అందించిన పాటలన్నీ ఒకేచోట దొరికితే బాగుంటుంది. ఈ టపా కొరకై మీకు నా కృతఙ్ఞతలు.