నిన్నటి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారి గానసుధ తెలుగు రేడియో కార్యక్రమంలో భారతరత్న భీమసేన్ జోషి గారికి నేను, భాస్కర్ గారు వేసిన నూలుపోగు. తెలుగు పాట కాకపోయినా, ఇది ఈ బ్లాగ్ చదివే వారి అభిరుచులకు తగినదనే నా ఊహ.
January 30, 2011
భారతరత్న భీమసేన్ జోషి
Labels:
గానసుధ తెలుగు రేడియో,
నూలుపోగు,
భారతరత్న,
భీమసేన్ జోషి
January 28, 2011
జన్మభూమి (ఏ దేశమేగినా)
రచన: రాయప్రోలు సుబ్బారావు
ఇది రికార్డు గానో, ఆకాశ వాణి లో పాట గానో వచ్చిందేమో తెలియదు - తెలిసిన వాళ్ళెవరైనా చెప్పండి, ఇక్కడ వ్రాస్తాను... పాట mp3 పంపిస్తే మరి సంతోషం!
ఇది రికార్డు గానో, ఆకాశ వాణి లో పాట గానో వచ్చిందేమో తెలియదు - తెలిసిన వాళ్ళెవరైనా చెప్పండి, ఇక్కడ వ్రాస్తాను... పాట mp3 పంపిస్తే మరి సంతోషం!
ఏ దేశమేగినా, ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని!
నిలుపరా నీ జాతి నిండు గౌరవము!
లేదురా ఇటువంటి భూదేవి ఎందు,
లేరురా మనవంటి పౌరులింకెందు!
ఏ పూర్వపుణ్యమో, ఏ యోగబలమో,
జనియించినాడవీ స్వర్గలోకమున
ఏ మంచిపూవులన్ బ్రేమించినావో
నిను మోసెనీతల్లి కనకగర్భమున
సూర్యుని వెలుతురు సోకునందాక -
ఓడలన్ జెండాలు ఆడునందాక -
నరుడు ప్రాణాలతో నడచునందాక -
అందాక గల ఈయనంతభూతలిని
మనభూమి వంటి కమ్మని భూమిలేదు!
తమ తపస్సులు ఋషుల్ ధారబోయంగ,
చండవీర్యము శూరచంద్రులర్పింప,
రాగదుగ్ధము భక్తరాజులీయంగ,
భావసూత్రము కవిబాంధవులల్ల,
దిక్కులకెగదన్ను తేజంబు వెలుగ,
జగములనూగించు మగతనంబెగయ,
రాలు పూవులు సేయు రాగాలు సాగ,
సౌందర్యమెగబోయు సాహిత్యమొప్ప;
వెలిగినదీ దివ్యవిశ్వంబు పుత్రా!
దిపించెనీ పుణ్యదేశంబు పుత్రా!
అవమానమేలరా? అనుమానమేల?
భారతపుత్రుడాయంచు భక్తితోబలుక!
Labels:
ఆకాశవాణి,
దేశభక్తి,
రాయప్రోలు సుబ్బారావు
January 18, 2011
జయ భారతావనీ! జయ లోకపావనీ! (జయ గీతి)
రచన: ;వానమామలై వరదాచార్యులు
స్వరకల్పన: నూకల చిన్న సత్యనారాయణపాడినది: ?
జయ భారతావనీ! జయ లోకపావనీ!
శాంతి సుఖదాయినీ! జననీ, నమస్తే!
సకల సంపత్ఖనీ! సస్య నందనవనీ!
ఆసేతుశీతనగహాటకావనీ! జననీ!
నీ మహోన్నతి - హిమానీగోత్ర శిఖరం
నీ పవిత్రత - గాంగనిర్ఝర ప్రవాహం
నీ చేతి సొమ్ము - ఎల్లోరా శిల్పఖండమ్ము
నీదు వాక్యమ్ము - శ్రీ గీతోపదేశం!
జయ భారతావనీ! జయ లోకపావనీ!
శాంతి సుఖదాయినీ! జననీ, నమస్తే!
ఆసేతుశీతనగహాటకావనీ: ఆసేతు + శీతనగ + హాటక + అవనీ - రామేశ్వరం (సేతు) నించి హిమాలయ పర్యంతంగా గల బంగరు (హాటక) భూమి;
హిమానీగోత్ర: గంగోత్రి; గాంగనిర్ఝర: గంగా నది
హిమానీగోత్ర: గంగోత్రి; గాంగనిర్ఝర: గంగా నది
January 16, 2011
తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
స్వరకల్పన: పాలగుమ్మి విశ్వనాథం (?)
పాడినది: బృందం
ఆకాశవాణి ఆణిముత్యం - గుర్తు చేసిన మిత్రుడు డొక్కా ఫణికుమారునికి కృతజ్ఞతలతో
స్వరకల్పన: పాలగుమ్మి విశ్వనాథం (?)
పాడినది: బృందం
ఆకాశవాణి ఆణిముత్యం - గుర్తు చేసిన మిత్రుడు డొక్కా ఫణికుమారునికి కృతజ్ఞతలతో
తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఎల్లరికనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో
తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
కొండదిగీ కోన దిగీ గుబురు అడవి కొమ్మలను దిగీ
ఉండి ఉండి ఒక ఇన కిరణమ్ము ఉర్వి ప్రభాతమ్ము నింపగా
తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఊరక చీకటి యవనిక లో ఒక్క క్షణం దాచారో ఎవరో
వారిక తారక దీపికనూ ఆరుపనేరుతురో ఎవరో
తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఈ సత్యాన్వేషికి, ఈ మితభాషికి ఎంత కాలమీ బంధన?
ఈ అసత్యాలలో దైవానికి ఎంత కాలమీ శోధన?
తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఎల్లరికనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో
తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
Labels:
ఆకాశవాణి,
దేవులపల్లి కృష్ణశాస్త్రి,
భక్తి,
భావగీతం,
లలితసంగీతం,
వేదాంత ధోరణి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
రచన: పాలగుమ్మి విశ్వనాథం
స్వరకల్పన: పాలగుమ్మి విశ్వనాథం
పాడినది: పాలగుమ్మి విశ్వనాథం
స్వరకల్పన: పాలగుమ్మి విశ్వనాథం
పాడినది: పాలగుమ్మి విశ్వనాథం
పంట చేల గట్ల మీద నడవాలి
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి
ఒయ్యారి నడకలతో ఆ ఏరు,
ఆ ఏరు దాటితే మా ఊరు!
ఊరి మధ్య కోవెల, కోనేరు
ఒకసారి చూస్తిరా తిరిగి పోలేరు!
ఊరి మధ్య కోవెల, కోనేరు
ఒకసారి చూస్తిరా వదిలి పోలేరు!
పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి
ఏరు దాటి తోట తోపు తిరగాలి
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి
మనసువిప్పి మాట్లాడే మనుషులు కలవాలి
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి
ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి
పంట చేల గట్ల మీద నడవాలి
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి
Labels:
ఆకాశవాణి,
దేశభక్తి,
పాలగుమ్మి విశ్వనాథం,
భావగీతం,
లలితసంగీతం
January 14, 2011
తరలి రారమ్మా!
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
స్వరకల్పన: నూకల చిన్న సత్యనారాయణ ?
ఈ పాట రికార్డింగ్ నేనెప్పుడూ వినలేదు - మా అమ్మకి చిన్నసత్యనారాయణ గారు గురువు; అయన దగ్గర మా అమ్మ నేర్చుకుంది; నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను.
స్వరకల్పన: నూకల చిన్న సత్యనారాయణ ?
ఈ పాట రికార్డింగ్ నేనెప్పుడూ వినలేదు - మా అమ్మకి చిన్నసత్యనారాయణ గారు గురువు; అయన దగ్గర మా అమ్మ నేర్చుకుంది; నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను.
తరలి రారమ్మా! తరలి రారమ్మా!
గౌతమీ, మంజీర, ఓ నాగావళీ, ఓ వంశధారా,
తుంగభద్ర, పినాకినీ, ఉత్తుంగ భంగా కృష్ణవేణీ!
తరలి రారమ్మా! తరలి రారమ్మా!
నురుగుల ముత్యాల చెరగుల, తరగ మడతల పావడాతో
తురిమి సిగలో రెల్లు పూమంజరులు ఝారులౌ సోయగముతో
తరలి రారమ్మా! తరలి రారమ్మా!
ఆవలి దరి ఎలమావి తోపులు, ఇవలి దరి వరిచేల కోపులు
ఆవల ఈవల చూచుచూ, తలలూచుచూ, రాయంచ నడకల
తరలి రారమ్మా! తరలి రారమ్మా!
చెరగు: అంచు; తరగ: అల; మంజరి: చిగిరించిన లేతకొమ్మ, పూలగుత్తి, పెద్ద ముత్యము; ఝరి: సెలయేరు; సోయగము: అందము; ఎల: లేత; వరి కోపులు: వరి మడులు; రాయంచ: రాజహంస
గౌతమీ, మంజీర, ఓ నాగావళీ, ఓ వంశధారా,
తుంగభద్ర, పినాకినీ, ఉత్తుంగ భంగా కృష్ణవేణీ!
తరలి రారమ్మా! తరలి రారమ్మా!
నురుగుల ముత్యాల చెరగుల, తరగ మడతల పావడాతో
తురిమి సిగలో రెల్లు పూమంజరులు ఝారులౌ సోయగముతో
తరలి రారమ్మా! తరలి రారమ్మా!
ఆవలి దరి ఎలమావి తోపులు, ఇవలి దరి వరిచేల కోపులు
ఆవల ఈవల చూచుచూ, తలలూచుచూ, రాయంచ నడకల
తరలి రారమ్మా! తరలి రారమ్మా!
January 12, 2011
బంగారు పాపాయి
రచన: మంచాల జగన్నాథ రావు
స్వరకల్పన: సాలూరు రాజేశ్వర రావు
పాడినది: రావు బాలసరస్వతి
జగన్నాథ రావు గారు బాలసరస్వతి గారి కూతురి పుట్టినరోజు సందర్భంగా వ్రాసిన పాట.
స్వరకల్పన: సాలూరు రాజేశ్వర రావు
పాడినది: రావు బాలసరస్వతి
జగన్నాథ రావు గారు బాలసరస్వతి గారి కూతురి పుట్టినరోజు సందర్భంగా వ్రాసిన పాట.
బంగారు పాపాయి బహుమతులు పొందాలి,
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు
పలు సీమలకు పోయి, తెలివిగల పాపాయి
కళలన్ని చూపించి ఘనకీర్తి పొందాలి
ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి!
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు
మా పాప పలికితే మధువులే కురియాలి!
పాపాయి పాడితే పాములే ఆడాలి!
మా పాప పలికితే మధువులే కురియాలి!
పాపాయి పాడితే పాములే ఆడాలి!
ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప?
ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి,
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు
తెనుగుదేశము నాది, తెనుగు పాపను నేను
అని పాప జగమంతా చాటి వెలయించాలి,
మా నోములపుడు మాబాగా ఫలియించాలి!
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు
పలు సీమలకు పోయి, తెలివిగల పాపాయి
కళలన్ని చూపించి ఘనకీర్తి పొందాలి
ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి!
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు
మా పాప పలికితే మధువులే కురియాలి!
పాపాయి పాడితే పాములే ఆడాలి!
మా పాప పలికితే మధువులే కురియాలి!
పాపాయి పాడితే పాములే ఆడాలి!
ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప?
ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి,
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు
తెనుగుదేశము నాది, తెనుగు పాపను నేను
అని పాప జగమంతా చాటి వెలయించాలి,
మా నోములపుడు మాబాగా ఫలియించాలి!
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు
Labels:
ఆకాశవాణి,
పిల్లలు,
పుట్టిన రోజు,
బాలసరస్వతి,
రాజేశ్వర రావు,
లలితసంగీతం,
సాలూరు
May 14, 2010
నీలి మేఘమాలవో నీలాల తారవో
చిత్రపటము: మదనకామరాజు కథ
రచన: పింగళి నాగేంద్ర రావు
స్వరకల్పన: సాలూరు రాజేశ్వర రావు
పాడినది: పీ బీ శ్రీనివాస్
సాహిత్యం రఫీ హిందీలో పాడిన చౌద్వీ కా చాంద్ హో కి అనుసరణ; బాణి పూర్తిగా హింది పాట అనుకరణ.
రచన: పింగళి నాగేంద్ర రావు
స్వరకల్పన: సాలూరు రాజేశ్వర రావు
పాడినది: పీ బీ శ్రీనివాస్
సాహిత్యం రఫీ హిందీలో పాడిన చౌద్వీ కా చాంద్ హో కి అనుసరణ; బాణి పూర్తిగా హింది పాట అనుకరణ.
నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినే దోచిపోదువో
నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినే దోచిపోదువో
నీలి మేఘమాలవో
నీ మోములోన జాబిలి దోబూచులాడెనే
నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే
నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో
నీలి మేఘమాలవో
నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే
నీ వలపు (పిలుపు?) తనివి తీరని మధురాల రావమే
నిలచేవదేల నా పిలుపు ఆలకించవో
నీలి మేఘమాలవో
రాదేల జాలి ఓ చెలీ ఈ మౌనమేలనే
రాగాల తెలిపోదమే జాగేల చాలునే
రావో యుగాల ప్రేయసీ నన్నాదరించవో
నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినే దోచిపోదువో
నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినే దోచిపోదువో
నీలి మేఘమాలవో
Labels:
పీబీ శ్రీనివాస్,
ప్రేమ,
సినీసంగీతం
September 24, 2007
గాలిలో నా బ్రతుకు
రచన: రతన్ రావు
స్వరకల్పన: ఘంటసాల
పాడినది: ఘంటసాల
ఇది ఘంటసాల గారి మొట్టమొదటి సోలో రికార్డింగ్.
స్వరకల్పన: ఘంటసాల
పాడినది: ఘంటసాల
ఇది ఘంటసాల గారి మొట్టమొదటి సోలో రికార్డింగ్.
గాలిలో...
గాలిలో నా బ్రతుకు
తేలిపోయినదోయి
నీలిలో కలసింది
మాలి! నా బ్రతుకోయి!
గాలిలో...
పంచభూతములార!
రాయంచ, గిరులార!
నా పంచ జేరరే!
పలుకరింపగ రారే!
గాలిలో...
రావోయి, రావోయి
నా దరికి రావోయి
ఆరిపోవునో ఏమో
నా చిన్ని వెలుగోయి
నా చిన్ని వెలుగోయి
గాలిలో...
కరుణ ఎరుణా లేని
కాలదేవతనుండి
కాపాడ రావోయి
గాలిలో నా బ్రతుకు
కరుణ ఎరుణా లేని
కాలదేవతనుండి
కాపాడ రావోయి
గాలిలో నా బ్రతుకు
నిలుపంగ రావోయి
గాలిలో నా బతుకు!
గాలిలో నా బ్రతుకు
తేలిపోయినదోయి
నీలిలో కలసింది
మాలి! నా బ్రతుకోయి!
గాలిలో...
గాలిలో నా బ్రతుకు
తేలిపోయినదోయి
నీలిలో కలసింది
మాలి! నా బ్రతుకోయి!
గాలిలో...
పంచభూతములార!
రాయంచ, గిరులార!
నా పంచ జేరరే!
పలుకరింపగ రారే!
గాలిలో...
రావోయి, రావోయి
నా దరికి రావోయి
ఆరిపోవునో ఏమో
నా చిన్ని వెలుగోయి
నా చిన్ని వెలుగోయి
గాలిలో...
కరుణ ఎరుణా లేని
కాలదేవతనుండి
కాపాడ రావోయి
గాలిలో నా బ్రతుకు
కరుణ ఎరుణా లేని
కాలదేవతనుండి
కాపాడ రావోయి
గాలిలో నా బ్రతుకు
నిలుపంగ రావోయి
గాలిలో నా బతుకు!
గాలిలో నా బ్రతుకు
తేలిపోయినదోయి
నీలిలో కలసింది
మాలి! నా బ్రతుకోయి!
గాలిలో...
రావోయి బంగారిమావా!
రచన: కొనకళ్ళ వెంకటరత్నం (బంగారిమావ పాటలు)
స్వరకల్పన: ఘంటసాల
పాడినది: ఘంటసాల
వెంకటరత్నం గారు రాసిన పాటలో మూడు చరణాలు మాత్రమే ఘంటసాల గారు పాడారు.
ఘంటసాల "వగ" అని పాడారని డొక్కా ఫణి వ్యాఖ్య. నిజమే. "సొద", "వగ" "చింత" కు పర్యాయపదాలే కాబట్టి అర్థ గౌరవం తగ్గదు; కానీ "సొద" కి "సోది" అనే (అనైఘంటిక) విపరీతార్థమే ఎక్కువ ప్రాచుర్యం పొంది ఉండటం వల్ల ఘంటసాల "వగ" అని పాడి ఉండచ్చు. అంతేగాక "వగ" కి "శృంగార చేష్ట", "ఆలోచన" అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఘంటసాల పాడిన మూడు చరణాలే గమనిస్తే ఈ అర్థం కూడా బాగా పొసుగుతుంది. వెంకటరత్నం గారు వ్రాసిన పాట పూర్తి పాఠం చదివినప్పుడు మాత్రం "చింత" అనే అన్వయించుకోవాలి.
స్వరకల్పన: ఘంటసాల
పాడినది: ఘంటసాల
వెంకటరత్నం గారు రాసిన పాటలో మూడు చరణాలు మాత్రమే ఘంటసాల గారు పాడారు.
ఘంటసాల "వగ" అని పాడారని డొక్కా ఫణి వ్యాఖ్య. నిజమే. "సొద", "వగ" "చింత" కు పర్యాయపదాలే కాబట్టి అర్థ గౌరవం తగ్గదు; కానీ "సొద" కి "సోది" అనే (అనైఘంటిక) విపరీతార్థమే ఎక్కువ ప్రాచుర్యం పొంది ఉండటం వల్ల ఘంటసాల "వగ" అని పాడి ఉండచ్చు. అంతేగాక "వగ" కి "శృంగార చేష్ట", "ఆలోచన" అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఘంటసాల పాడిన మూడు చరణాలే గమనిస్తే ఈ అర్థం కూడా బాగా పొసుగుతుంది. వెంకటరత్నం గారు వ్రాసిన పాట పూర్తి పాఠం చదివినప్పుడు మాత్రం "చింత" అనే అన్వయించుకోవాలి.
రావోయి బంగారిమావా!
నీతోటి రహస్యమొకటున్నదోయీ,
రావోయి బంగారిమావా!
నీళ్ళ తూరలవెన్క
నిలుచున్నపాటనే
జలజలల్ విని గుండె
ఝల్లుమంటున్నాది ,
రావోయి బంగారి మావా!
అవిసె పూవులు రెండు
అందకున్నయి నాకు
తుంచి నా సిగలోన
తురిమి పోదువుగాని,
రావోయి బంగారి మావా!
ఏటి పడవ సరంగు
పాట గిరికీలలో
చెలికాడ మన సొదల్
కలబోసుకొందాము
రావోయి బంగారి మావా!
నీతోటి రహస్యమొకటున్నదోయీ,
రావోయి బంగారిమావా!
నీళ్ళ తూరలవెన్క
నిలుచున్నపాటనే
జలజలల్ విని గుండె
ఝల్లుమంటున్నాది ,
రావోయి బంగారి మావా!
అవిసె పూవులు రెండు
అందకున్నయి నాకు
తుంచి నా సిగలోన
తురిమి పోదువుగాని,
రావోయి బంగారి మావా!
ఏటి పడవ సరంగు
పాట గిరికీలలో
చెలికాడ మన సొదల్
కలబోసుకొందాము
రావోయి బంగారి మావా!
Labels:
ఆకాశవాణి,
కొనకళ్ళ వెంకటరత్నం,
ఘంటసాల,
జానపద సంగీతం,
ప్రేమ,
బంగారిమావ పాటలు,
విరహం
Subscribe to:
Posts (Atom)